CM Jagan Forget Promises on Veligonda Project : 2023 సెప్టెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తానని, తరవాతనే ఎన్నిలకు వెళ్తానని సీఎం జగన్ గత సంవత్సరం ఆగస్టు 25 వ తేదీన చెప్పిన ప్రగల్భాలు. ఆయనిచ్చిన మాట ప్రకారం ఈ సెప్టెంబర్‌కే ప్రాజెక్ట్ పూర్తవ్వాలి, గడువు దాటి రెండు నెలలవుతున్నా నేటికీ పూర్తి కాలేదు. 18.85 కిలోమీటర్లు పొడవు గల రెండు సొరంగాల్లో మొదటి సొరంగం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే దాదాపు 17 కిలోమీర్లు మేర పూర్తైంది. మిగతా కిలోమీటరు మేర వైసీపీ సర్కార్ పూర్తిచేసింది. ఇక రెండో సొరంగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో యంత్రాలతో సొరంగాలు తవ్వగా, ఇప్పుడు మానవ వనరులతోనే పనులు చేయిస్తున్నారు.
Veligonda Project Construction Work Progressing Slowly :రెండు సొరంగాల ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసేందుకు.. పెద్దారవీడు, అర్ధవీడు మండలాల మధ్యలో ఉన్న భూ భాగంలో నల్లమల జలాశయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాతంలో జిరాయితీ,అసైన్‌మెంట్ భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. 2006 నుంచి 2009 మధ్య సాగునీటి వసతి ఉన్న భూములకు 90 వేలు, లేని వాటికి 70 వేల రూపాయల చొప్పున పరిహారం అందించారు. కానీ నిర్వాసితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు.
CM JAGAN వెలిగొండను ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామన్న సీఎం జగన్
2023 సెప్టెంబర్‌లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామన్నారు. ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇక గ్రానైట్ పరిశ్రమలో మళ్లీ శ్లాబ్ విధానం తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. చిన్న పరిశ్రమలను బాగు చేయడమే లక్ష్యంగా ఈమేరకు జీవో కూడా జారీ చేశామన్నారు.
YSRCP Government Negligence on Irrigation Projects in AP :ఈ జలాశయం మధ్యలో గొట్టిపడియ, అక్క చెరువు, లక్ష్మీపురం, కృష్ణానగర్, రామలింగేశ్వరపురం, సాయిరాం కాలనీ, కలనూతల, కొత్త నూతల, చింతలముడిపి, గుండంచర్ల, కాటంరాజుతండా, గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీని ప్రభావం 7 వేల 5 వందల 59 కుటుంబాలపై పడుతుంది. 2006లో చేపట్టిన సామాజిక సర్వేలో 4 వేల 5 వందల 65 కుటుంబాల్ని నిర్వాసితుల జాబితాలో చేర్చారు. ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన మరో 2 వేల 9వందల 95 మంది యువతీ యువకులను కూడా R అండ్ R ప్యాకేజీలో అర్హులుగా చేర్చారు. ప్యాకేజీ అమలు గందరగోళంగా మారింది.
Veligonda Project Victims Not Received Compensation :గత ప్రభుత్వం వెలిగొండ నిర్వాసితులకు పరిహారం కింద 10 లక్షల 50 వేల రూపాయల చొప్పున ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వారికి 6 లక్షల 75 వేల రూపాయల పరిహారం ఇస్తామన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు పరిహారాన్ని 12 లక్షల 50 వేల రూపాయలకు పెంచారు. ఐతే వైసీపీ అధికారంలోకొస్తే పరిహారాన్ని 20 లక్షల రూపాయలకు పెంచుతామని జగన్ అప్పట్లో నమ్మబలికారు. గద్దెనెక్కాక ఆ ఊసేలేదు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా 20 లక్షలు ఇవ్వాల్సిందేనని నిర్వాసితులు పట్టుబడుతున్నారు.
Veligonda Project: దుర్భరంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల జీవనం.. సర్వం త్యాగం చేసినా దక్కని అండ
CM Jagan False Promises on Veligonda Project :గత ప్రభుత్వం ప్రకటించిన 12 లక్షల 50 వేలు మాత్రమే ఇస్తామని అధికారులు బేరాలు ఆడుతున్నారు. 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి, దానికి బదులుగా పరిహారంలో 70 వేలు మినహాయించి 11 లక్షల 80 వేలు ఇస్తామని గతంలో పని చేసిన కలెక్టర్ భాస్కర్‌రావు ప్రతిపాదించారు. దానికి నిర్వాసితులు ఒప్పుకున్నారు. ఇంటి నిర్మాణానికి రెండు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో వన్ టైమ్ సెటిల్‌మెంట్‌గా 12 లక్షల 60 వేల స్కీమ్ ప్రతిపాదన తెచ్చారు. అధికారులు మారడంతో కథ మళ్లీ మొదటకొచ్చింది.
Poola Subbaiah Veligonda Project in AP :గత కలెక్టర్ ప్రతిపాదన పక్కనపెట్టేశారు. పాత ప్రతిపాదన మేరకు ఇల్లు నిర్మించి, 6 లక్షల 75 వేల పరిహారం ఇస్తామని చెప్తున్నారు. అసలు ప్యాకేజీ ఎంతో తెలియక, నిర్వాసితులు సతమతమవుతున్నారు. నిర్వాసితులకు దాదాపు 800 నుంచి 900 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే లేరని నిర్వసితులు వాపోతున్నారు.
Poola Subbaiah Veligonda Project Victims Problems :వెలిగొండ నిర్వాసిత కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. కొందరికి పట్టాలిచ్చినా, పొజిషన్ చూపించలేదు. అధికారులు మాత్రం ఇళ్లు కూలగొట్టేందుకు సర్వే కూడా ప్రారంభించారు. తక్షణం గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తుండగా నిర్వాసిత కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎక్కడికి వెళ్లాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Veligonda Project Construction Work Delay :అధికారం కోసం హామీలు గుప్పించిన సీఎం జగన్.. ఇప్పటికైనా తమకు ప్యాకేజీ విడుదల చేసి ఆదుకోవాలని నిర్వాసితులు మొరపెట్టుకుంటున్నారు.
CM Jagan False Promises on Veligonda Project: ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూపు.. వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ మాటలు నీటి మూటలేనా..?