ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్థరాత్రి దొంగతనం... 5 తులాల బంగారం మాయం - crime news in prakasam dst

ప్రకాశం జిల్లా కొమరోలులో పురుషోత్తం పల్లి కాలనీ వాసులను దొంగల బెడద వేధిస్తోంది. అర్థరాత్రి వేళ.. ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

chori at prakasam dst komarolu gold,sliver and cash stolen
chori at prakasam dst komarolu gold,sliver and cash stolen

By

Published : Jun 7, 2020, 3:50 PM IST

ప్రకాశం జిల్లా కొమరోలు పురుషోత్తం పల్లి రోడ్డులోని ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లోని బీరువా పగలగొట్టి 5 తులాల బంగారం, 7 తులాల వెండితో పాటు నగదును దోచుకెళ్లారని బాధితులు తెలిపారు.

ఇంటి యజమాని, వారి కుటుంబ సభ్యులు ఇంటి పైన నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగింది. సీఐ సుధాకరరావు, కొమరోలు ఎస్ ఐ మల్లికార్జునరావు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంను రంగంలోకి దించారు. దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details