అప్పుడే పుట్టిన చిన్నారిని.. కనికరం లేకుండా మురుగు కాల్వలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు.. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జోరు వర్షం కురుస్తున్న వేళ.. వీధులన్నీ నిర్మానుష్యంగా మారిన సమయంలో.. పసిపాపను కాల్వలో పడేసి వెళ్లారు. చిన్నారిని గుర్తించిన స్థానికులు కాల్వలోనుంచి బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న పొత్తిళ్లపాపను కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. కొద్ది సేపటికే చిన్నారి మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
మురుగు కాల్వలో పసిపాప.. కాపాడేలోగా విషాదం! - cheerala latest news
ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని చిన్నారిని మురుగు కాల్వలో పడేశారు! కొన ఊపిరితో ఉన్న పాపను కాపాడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. విఫలమైంది.
child died in drainage in cheerala prakasham district