కారులో మంటలు... యజమానికి తప్పిన ముప్పు - car fire
ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు వచ్చి కారు దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. ముందుగా కారు యజమాని బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది.
car fire_Accident_in_prakasham
మర్రిపూడి మండలం సన్నమూరుకు చెందిన కోలా బ్రహ్మానందం మేస్త్రీ. హైదరాబాద్లో బిల్డింగ్ పనులు చేయిస్తూ ఉంటారు. పనిపై నిన్న గుంటూరు వెళ్లే సమయంలో ప్రకాశం జిల్లా రేగలగడ్డ గ్రామంలోని బస్టాండ్ వద్ద షార్ట్ సర్క్యూట్తో కారులో ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన బ్రహ్మానందం కిందకి దిగారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే..కారులో మంటలు చేలరేగి కాలిపోయింది. యాజమాని ముందుగా దిగడం వల్ల ప్రమాదం తప్పింది.