ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లె సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నికరంపల్లి సమీపంలోకి కారు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షామిలి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని రాయచూరుకు చెందిన కుటుంబం శ్రీశైలం వెళుతుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. కారు డ్రైవర్ అప్రమతంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
డ్రైవర్ అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం - markapuram
ప్రకాశం జిల్లా మార్కాపురంలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలానికి వెళ్తున్న కారును నికరంపల్లి సమీపంలో లారీ ఢీకొట్టింది. కారు డ్రైవర్ అప్రమత్తతతో కుటుంబమంతా గాయాలతో బయటపడ్డారు.
డ్రైవర్ అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం