ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసువారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ హాజరయ్యారు. రక్తం ఇచ్చేందుకు చాలామంది యువకులు ముందుకువచ్చారు. పోలీసు సిబ్బందీ రక్తదానం చేశారు. మనం ఇచ్చే రక్తం ఒక మనిషి ప్రాణాలను నిలబెడుతుందనీ.. రక్తదానానికి అంత ప్రాముఖ్యం ఉందని సీఐ తెలిపారు.
రక్తదానం.. నిలబెడుతుంది ప్రాణం - గిద్దలూరు
గిద్దలూరులో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. చాలామంది యువకులు రక్తదానానికి ముందుకు వచ్చారు.
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం