దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రకాశం జిల్లా చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎం.గ్రెగోరి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరాలలో ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విపక్షాల తీరును నిరసిస్తూ చీరాలలో ద్విచక్రవాహనాల ర్యాలీ - ప్రకాశం జిల్లాలో బైక్ ర్యాలీ
ప్రకాశం జిల్లా చీరాలలో ద్విచక్రవాహనాల ర్యాలీ జరిగింది. ప్రతిపక్షాలు.... ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని మార్కెట్ కమిటీ ఛైర్మన్ అన్నారు.
చీరాలలో ద్విచక్రవాహనాల ర్యాలీ