ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలో కొలుకుల సెంటర్ వద్ద ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు వద్ద సాంస్కృతిక కార్యాక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యాక్రమాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర భరతనాట్యం అకాడమీ వారిచే చిన్నారుల భరత నాట్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.