మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి సొంత నియోజకవర్గం ప్రకాశంజిల్లా ఒంగోలు వచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి వైకాపా శ్రేణులు పలికాయి. గుళ్లపల్లి గ్రోత్ సెంటర్ వద్దకు ఎదురువెళ్లి స్వాగతం పలికిన బాలినేని అభిమానులు అక్కడ నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా బాణసంచా కాల్చి సందడి చేశారు. కర్నూలు రోడ్డు వంతెన, బస్టాండ్ సెంటర్, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్ సెంటర్ , కొత్తపట్నం బస్టాండ్,చర్చ్ సెంటర్, కోర్ట్ సెంటర్ మీదుగా బాలినేని ఇంటి వరకు జరిగిన ర్యాలీలో బాలినేని అభిమానులు, వైకాపా కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డికి బాలినేని కృతజ్ఞతలు తెలిపారు. తండ్రి వైఎస్, కుమారుడు జగన్ ఇద్దరి మంత్రి వర్గాల్లో మంత్రిగా ఉండటం తన అదృష్టమని అన్నారు.
మంత్రి బాలినేనికి వైకాపా శ్రేణుల ఘనస్వాగతం - BALINENI_GRAND_WELCOME
మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి సొంత నియోజకవర్గం ప్రకాశంజిల్లా ఒంగోలు వచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బాలినేని అభిమానులు నగరంలో ర్యాలీ నిర్వహించారు.
ఒంగోలులో బాలినేనికి ఘన స్వాగతం