వైద్యం వికటించి నలుగురు పసికందులు అస్వస్థతకు గురైన ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏ.ఎన్.ఎం ,ఆశావర్కర్లు గ్రామంలోని చిన్నారులకు టీకాలు వేశారు. జ్వరానికని పిల్లలకు మాత్రలు ఇచ్చారు. వారిచ్చిన మాత్రలను తల్లిదండ్రులు చిన్నారులకు వేశారు. దీంతో పిల్లలు అస్వస్దతకు గురై నిరసంగా తయారవడంతో వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఏ.ఎన్.ఎం ,ఆశావర్కర్లు ఇచ్చిన మాత్రలను వైద్యులకు చూపించగా అవి షుగర్ మాత్రలని తేలింది. వారి నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.
"జ్వరమని వస్తే... షుగర్ ట్యాబ్లెట్లు ఇచ్చారు" - cheerala
ఏ.ఎన్.ఎం, ఆశావర్కర్ తప్పిదం నలుగురు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. జ్వరమని వస్తే... షుగర్ ట్యాబ్లెట్లు ఇవ్వడంతో వారు అస్వస్థతకు గురయ్యారు.
అస్వస్థకు గురైన చిన్నారులు
డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ విచారణ...
నలుగురు పసికందులు ఆస్వస్దతకు గురైన సంఘటనపై డిప్యూటి డిఎం అండ్ హెచ్ఓ మాధవీలత విచారణ చేపట్టారు.. చీరాలలో ప్రవేటు ఆస్పత్రిలో చికిస్సపొందుతున్న చిన్నారులను పరామర్సించి తల్లిదండ్రలతో మాట్లాడారు. సమగ్ర విచారణ చేపట్టి... నివేదికను పై అధికారులకు అందచేస్తామని మాధవీ లత తెలిపారు.
ఇదీ చదవండి... తప్పుడు పని అన్నందుకు ప్రాణం తీశాడు
Last Updated : Jun 16, 2019, 7:39 AM IST