రొంపేరు కాలువ పరిధిలో 'ఆక్వా రైతుల ఆందోళన' - romperu canal
ప్రకాశం జిల్లా ఆక్వా రైతులు ఆందోళన చేశారు. రొంపేరు కాలువలో అడ్డుకట్టలను తొలగించాలని డిమాండ్ చేసారు.లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని అన్నారు.
' ఆక్వా రైతుల ఆందోళన'
ప్రకాశం జిల్లా చినగంజాం-రొంపేరు కాలువ పరిధిలోని ఆక్వా రైతులు నిరసన వ్యక్తం చేశారు . జాతీయ రహదారి 216 పై దిలీప్ కంపెనీ, అమీన్ నగర్ వద్ద నీరు పారకుండా వేసిన అడ్డుకట్టలను తొలగిచాలని ఆందోళన చేపట్టారు. రైల్వే లైను వేస్తున్న గుత్తేదారుడు సైతం అడ్డుకట్టను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 5 వ తేదీ నాటికి వాటిని తొలగించక పోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.