Aqua farmers: ప్రకాశం జిల్లా తీరం వెంబడి దాదాపు 30వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.. ప్రధానంగా వనామీ రొయ్య సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు.. తీరం వెంబడి మరే పంటకు అనుకూలంగా లేకపోవడంతో ఈ పంటను మాత్రమే సాగు చేస్తున్నారు.. గత కొన్నాళ్లుగా ఒడుదుడుకుల మధ్య వనామీ సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.. చిన్న రైతులు నుంచి 50, 100 ఎకరాలు చెరువులు వేసిన రైతులు కూడా ఉన్నారు.. అయితే గత ఏడాది ధర విషయంలో కొనుగోలుదారులు నచ్చినట్లు వ్యవహరించడంతో వనామీ రైతులు ఇబ్బందులు పడ్డారు.. మేత, విత్తనం వంటివి అరువు పద్దతిపై కొనుగోలు చేసి, పంట తీత సమయంలో వచ్చే నగదుతో అప్పులు తీరుస్తూ సాగుచేస్తున్నారు. పంట ఖర్చులు బాగా పెరిగిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.. ప్రధానంగా విద్యుత్తు చార్జీలు రైతులకు పెనుభారంగా మారింది.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో యూనిట్ ధర రెండు రూపాయలు ఉన్న విద్యుత్తు చార్జీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపాయిన్నరకు తగ్గించింది.. దీంతో ఆక్వా రైతుకు ఊరట కలగడమే కాకుండా, పంట విస్తీర్ణం పెరగడానికి కారణమైంది.. అయితే ఇది మూణ్ణాళ్ల ముచ్చటయ్యింది. గత ఏడాదన్నర కాలంలో విద్యుత్తు రాయితీ ఎత్తేసారు.. పైగా ట్రూ అప్ చార్జీలు పేరుతో మరికొంత బాదారు.. రూపాయిన్నర ఉన్న యూనిట్ ధర రూ 4.25 వరకూ పెరిగిపోయింది.. ఒక్క సారి మూడు రెట్లు పెరడం వల్ల పెనుబారంగా మారింది.. దీనికి తోడు మేత కిలో 71 రూపాయలు నుంచి 90- 95 రూపాయల వరకూ పెరిగిపోయింది.. ఇలా 100కౌంట్‌కు రొయ్యల సాగు ఖర్చులు దాదాపు 270 రూపాయలు అవుతుంది.. ప్రస్తుతం మార్కెట్ లో కిలో రొయ్యలు ధర 240-250 రూపాయల పలుకుతుంది... అంటే కిలోకు 20 రూపాయల వరకూ నష్టం ఏర్పడుతుంది... ఇలాంటి పరిస్థితుల్లో పంట వేసినా ధర వేసినా నష్టమే మిగులుతుందని ఎవరూ పంట వేయడం మానేసారు.