ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీఐఐసీ భూములు సోలార్ సంస్థకు అప్పగిస్తూ జీవో

ఏపీఐఐసీకి చెందిన భూములను సోలార్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2,395 ఎకరాల్లో 1454 ఎకరాలను ఒకే ఒక సంస్థకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. దొనకొండను మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌గా గత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఒకే సంస్థకు ఏకమొత్తంలో భూమిని కేటాయించారు.

ఏపీఐఐసీ భూములు సోలార్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
ఏపీఐఐసీ భూములు సోలార్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

By

Published : Sep 24, 2020, 6:34 PM IST

చిన్న, మధ్య తరహాపరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడ దారి మళ్ళుతోంది. ఈ పారిశ్రామిక వాడ కోసం కేటాయించిన భూములను ఓ సౌర విద్యుత్తు సంస్థకు ఏక మొత్తంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపీఐఐసీకి చెందిన 1454 ఎకరాలు...సోలార్‌ సంస్థకు బదలాయిస్తూ జిల్లా కలెక్టర్‌ కు అధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దొనకొండను ప్రారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన గత ప్రభుత్వం.... 2018లో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధి సంస్థకు 2వేల3వందల95 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌గా దీన్ని ప్రకటించి, మౌళిక సదుపాయాలకోసం కొన్ని పనులు చేపట్టింది. అంతలో ప్రభుత్వం మారిపోవడంతో... ఏపీఐఐసీకి కేటాయించిన భూముల్లో అగ్ర భాగం ఒకే ఒక ప్రాజెక్టుకు అప్పగించేందుకు ఇప్పటి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. గ్రీన్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ లిమిటెడ్‌కు కట్టబెట్టేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం ఏపీఐఐసీ భూములకు ప్రక్కనున్న అసైన్డ్‌ భూములు కూడా కట్టబెట్టేందుకు కొన్ని చట్టసవరణలకు కూడా చేస్తున్నారు. దీనికి తోడు మరికొంత ప్రయివేట్‌ భూములు కూడా సేకరించే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details