'నువ్వు చనిపోయావని ఆన్లైన్లో చూపిస్తోంది. అందుకే నీకు పింఛన్ రావటం లేదు' ఇది దేవమ్మ అనే వృద్ధురాలికి ఓ అధికారి చెప్పిన సమాధానం. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం శింగరపల్లి గ్రామానికి చెందిన చల్లగాలి దేవమ్మ 2004 నుంచి వృద్ధాప్య పింఛన్ పొందుతోంది. అయితే ఆమె కుమారుడు వృత్తి రీత్యా మార్కాపురంలోని భగత్ సింగ్ కాలనీలో నివాసముంటున్నాడు. ఒంటరిగా ఉండలేని దేవమ్మ.... కుమారుడు వద్దకు వెళ్లింది. ప్రతి నెలా స్వగ్రామం శింగరపల్లికి వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకునేది.
'నేను బతికే ఉన్నాను... పింఛన్ ఇప్పించండయ్యా' - markapur latest news
అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆమె ప్రాణాలతో ఉన్నా చనిపోయిందని ఆన్లైన్లో నమోదు కావటంతో పింఛన్ ఆగిపోయింది. నేను బతికే ఉన్నాను. నాకు పింఛన్ ఇప్పించండి అంటూ ఆమె అధికారులను వేడుకుంటోంది.
old woman's pension was stopped
వయోభారం కారణంగా ప్రతినెలా అటూ ఇటూ తిరగలేని దేవమ్మ.... ఈ ఏడాది జనవరి నెలలో తమ పింఛన్‌ను మార్కాపురానికి బదిలీ చేయాలని వాలంటీర్‌ను కోరింది. ఇక అంతే మరుసటి నెలలో ఆమె పింఛన్ రద్దైపోయింది. ఏంటా అని ఆరా తీస్తే ఆన్లైన్లో మరణించినట్లు ఉందని అధికారులు తెలిపారు. వారి మాటలకు ఖంగుతిన్న వృద్ధురాలు న్యాయం కోసం మార్కాపురం ఆర్డీఓ కార్యాలయానికి బుధవారం చేరుకుంది. తనకు తిరిగి పింఛన్ ఇప్పించాలని అక్కడున్న అధికారులను వేడుకుంది.