ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య మరోసారి వివాదం నెలకొంది. వాడరేవులో శుక్రవారం మత్స్యకారుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన మత్స్యకార బాధితులను ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరామర్శించారు. ఆమంచి కృష్ణమోహన్ ప్రోద్బలంతోనే తమ గ్రామంపై దాడులు జరిగాయని.. ఆమంచి గోబ్యాక్ అంటూ మత్స్యకారులు నినాదాలు చేశారు. ఆ సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ కారును అడ్డుకుని కరణం వెంకటేష్ అనుచరులు తమపై దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. ఈ దాడిలో ఇద్దరు ఆమంచి వర్గీయులకు గాయాలయ్యాయి. బాధితులను చీరాల ఆసుపత్రికి తరలించారు.
వాడరేవులో మరోసారి ఉద్రిక్తత.. కరణం, ఆమంచి వర్గీయుల ఘర్షణ
ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో కరణం, ఆమంచి వర్గీయుల మధ్య మరోసారి వివాదం నెలకొంది. ఎంపీ మోపిదేవి మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుండగా.. ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.
వాడరేవులో మరోసారి వివాదం.. ఇద్దరికీ గాయాలు
గొడవలొద్దు..
చిన్న విషయాలకు గొడవలు వద్దని... మత్స్యకారులందరూ అన్నదమ్ములుగా మెలగాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. మత్స్యకారుల మధ్య వివాదం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లిందని.. వాటి పూర్వపరాలను పరిశీలించి రావాలని తనను పంపించారని చెప్పారు. చిన్న విషయాలకు గొడవలు పడకుండా.. పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.
ఇదీ చదవండి:పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్