ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. బాధిత వ్యక్తి... ఈనెల 14న అనారోగ్యంతో ఒంగోలు వెళ్లారు. వైద్య చికిత్స కోసం 16న హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. విషయం తెలుసుకున్న అద్దంకి పోలీసులు, వైద్య, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఆ వ్యక్తికి ఏవిధంగా కరోనా సోకింది?... అతను ఎవరెవర్ని కలిశారు? అనే వివరాలు సేకరిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించారు.
అద్దంకి వాసికి హైదరాబాద్‌లో కరోనా నిర్థరణ
ప్రకాశం జిల్లా అద్దంకిలో కరోనా కలకలం రేగింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా కరోనా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన అధికారులు అతను ఎవరెవర్నీ కలిశారో ఆరా తీస్తున్నారు.
అద్దింకి వాసికి హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ నిర్థరణ