ప్రకాశం జిల్లా అద్దంకి అధికారులు.. రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. పట్టణానికి చెందిన వార్డుల డీలర్లు హాజరయ్యారు. రేషన్ కార్డులు ఎక్కువ ఉన్న డీలర్లకు అదనంగా షాపులు ఏర్పాటు చేశామని తహసీల్దార్ తెలిపారు. వాటిని పంచేందుకు సచివాలయ సిబ్బందిని నియమించారు. సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సంబంధిత ప్రదేశాల్లో రేషన్ ఇవ్వాలని తెలియజేశారు.
'కార్డులు ఎక్కువగా ఉంటే.. అదనంగా రేషన్ దుకాణాలు'
అద్దంకిలో చౌక ధరల దుకాణాల డీలర్లు, అధికారుల మధ్య సమావేశం జరిగింది. ప్రజలకు సరుకుల పంపిణీలో సమస్యల పరిష్కారంపై చర్చించారు.
అద్దంకి రేషన్ డీలర్లతో మాట్లాడుతున్న పట్టణ తహసీల్దార్