వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండో విడత సాయాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని 7వ తేదీన సీఎం జగన్ ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండో విడత కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 7.97 లక్షల మహిళా సంఘాల్లోని 78.76 లక్షల మంది సభ్యులకు రూ.6,439 కోట్లు అందించనుంది. ఆసరా కింద ఇచ్చే మొత్తాన్ని సభ్యులు ఎలా వినియోగించుకుంటారనే దానిపై ఎలాంటి షరతులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Aasara Scheme: రేపటి నుంచి రెండో విడత 'ఆసరా'..ప్రారంభించనున్న సీఎం జగన్
స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆసరా పథకం రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ రేపు ప్రారంభించనున్నారు. 7.97 లక్షల మహిళా సంఘాల్లోని 78.76 లక్షల మంది సభ్యులకు రూ.6,439 కోట్లు అందించనుంది.
aasara scheme