ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి గ్రామ సమీప పొలాల్లో ద్రోణాదుల ఆదిలక్ష్మి (28) అనే ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పురగులు మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త కూలి పనుల నిమిత్తం బెంగళూరు వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే పోయాడని గ్రామస్థులు వెల్లడించారు. ఆదిలక్ష్మి తన ముగ్గురు పిల్లలతో ఒంటరిగా బల్లిపల్లి గ్రామంలో నివాసం వుంటుందని చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య - women suicide in prakasam dst
ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె భర్త లాక్డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయారు.
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య