కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో చిక్కుకుపోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలను తరలించేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అధికారులు ప్రత్యేక రైలును ఏర్పాటుచేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరింది.
ఒంగోలు నుంచి బయలుదేరిన వలస కూలీల రైలు
ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మధ్యప్రదేశ్ వరకు వలస కూలీల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరింది.
ఒంగోలు నుండి బయలుదేరిన వలస కూలీల రైలు
ప్రకాశం జిల్లా నుంచి 619, నెల్లూరు 363, కడప 90, కర్నూలు 60, అనంతపురం 120, పశ్చిమగోదావరి 54, చిత్తూరు 90 మంది.. మొత్తం 1396 మందిని మధ్యప్రదేశ్‌లోని రేవ ప్రాంతానికి బోగీలలో భౌతికదూరం పాటిస్తూ కూర్చునే ఏర్పాటు చేసి తరలించారు. కూలీలకు ఆహారపోట్లలు అందజేశారు.
ఇది చదవండిఒంగోలు రిమ్స్‌కు మృతదేహాలు తరలింపు