పుట్టింది దళితకులంలో... పెరిగింది పేదరికంలో.. కానీ ప్రభుత్వాలు దళితులకు సాయం చెయ్యవు అనే అపోహను తుడిపేయాలని, ప్రభుత్వ సాయంతో వస్త్రాలు తయారు చేసి మార్కెట్లో అడుగుపెట్టాడు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతంగా వ్యాపారం మెదలుపెట్టాడు. ప్రారంభించినప్పుడు కష్టంగా ఉన్నా ఇష్టపడి సాధించాలనే తపనతో ఇప్పుడు విజయం అగ్రస్థానానికి చేరుకోగలిగాడు. ప్రస్తుతం 1.5 కోట్ల టర్నోవర్ సాధిస్తూ మరో 20 మందికి ఉపాధిని చూపుతూ ఉన్నతంగా జీవిస్తున్నాడు ఈ నవ యువకుడు.
నవతరానికి ఆదర్శం నవజోత్ - పారిశ్రామిక రంగం
చదువుకుని కొలువులు సాధించాలనేది ఈతరం యువకులు కోరిక... కానీ అతను మాత్రం చదువుకుని పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేశాడు. ఉపాధి తెచ్చుకోవాలనే స్థాయి నుంచి 20 మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగాడు.ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన కసుకుర్తి నవజోత్.
యువ పారిశ్రామిక వేత్త