ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెల్లంపల్లి వద్ద ప్రమాదం: ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు - వెల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

శుభకార్యానికి వెళ్తుండగా ప్రకాశం జిల్లా వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనానికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది.

a person died and two persons injured in a road accident
వెల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

By

Published : Dec 6, 2020, 10:42 PM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వెల్లంపల్లికి చెందిన మార్తమ్మ (63), ఆమె కుమార్తె, అల్లుడు ద్విచక్రవాహనంపై ఓ శుభకార్యానికి బయలుదేరారు. వీళ్ల బైకును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది.

ప్రమాదంలో మార్తమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్​కు తరలించారు. చేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details