ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయలక్ష్మిపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకొచ్చింది. అలల తాకిడికి ఒడ్డుకు చేరింది. తెప్పపై శ్రీలంకకు చెందిన ఆనవాళ్లతో ఉన్న ఆ మందిరాన్ని చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మందిరాన్ని పరిశీలించారు. మందిరంపై ఉన్న జెండా ఆనవాళ్లపై ఆరా తీశారు. మందిరం లోపల పది నుంచి 12 కిలోల బరువున్న రాగి, ఇతర లోహలతో తయారుచేసిన ఓ స్వామి విగ్రహం ఉందని... పక్కనే ఓ అగ్గిపెట్టపై శ్రీలంక అని ముద్రించి ఉందని గ్రామస్తులు చెపుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
సముద్రతీరానికి కొట్టుకువచ్చిన భారీ మందిరం - 'సముద్రతీరానికి కొట్టుకువచ్చిన ఓ భారీ మందిరం'
చీరాల మండలం విజయలక్ష్మిపురం సముద్రతీరాన అలలకు ఓ మందిరం కొట్టుకువచ్చింది. ఇది ఎక్కడిది.. ఎలా వచ్చిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'సముద్రతీరానికి కొట్టుకువచ్చిన ఓ భారీ మందిరం'