ఆ బామ్మ వయసేమో 80.. మనసు మాత్రం పదహారే అన్నట్లు ఉత్సాహపరిచింది. జీడి గింజల్లో జిల్లాటలో... అంటూ అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది. పాట ఏదైనా సంగీతానికి అనుగుణంగా కాళ్లు కదిపి నృత్యం చేసింది. నాతో పోటీకి రాగలరా అని యువతకు సవాల్ విసిరింది. ప్రకాశం జిల్లా ఒంగోలు తాత బిల్డింగ్స్ బాపూజీ విగ్రహం వద్ద జరిగిన నరకాసుర వధలో ఈ బామ్మ పాల్గొంది. నరకాసుర వధకు ముందు జరిగిన సాంసృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ.. అందరినీ అలరిచింది.
ఇప్పటికింకా.. ఈ బామ్మ వయసు నిండా పదహారే! - డ్యాన్స్ చేసిన బామ్మ న్యూస్ ఒంగోలు
80 ఏళ్ల బామ్మ.. కాలు కదపాలంటే కష్టమే... కానీ ఓ బామ్మ మాత్రం ఇప్పటికీ చిందులేస్తోంది. యువకులను ఉత్సాహపరుస్తోంది. పాట ఏదైనా అదిరిపోయేలా స్టెప్పులేస్తోంది.
old women dance in ongole