State Level Kabaddi Competitions: ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజు ఉత్సాహంగా సాగుతున్నాయి. సంక్రాంతి రోజు కావడంతో పెద్ద ఎత్తున క్రీడాభిమానులు వచ్చి పోటీలను తిలకిస్తున్నారు. ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి.
సంక్రాంతి సంబరాల్లో "చెడుగుడు".. ఉత్సాహంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు - 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
State Level Kabaddi Competitions: ప్రకాశం జిల్లాలో 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజు ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్స్ కొనసాగుతున్నాయి. సాయంత్రం ఫైనల్స్ జరగనున్నాయి.
ఉత్సహంగా సాగుతున్న 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
నేటి ఉదయం నుంచి క్వార్టర్ ఫైనల్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. బాలికల్లో 8, బాలురల్లో 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్లో ఆడుతున్నాయి. సాయంత్రం జరిగే ఫైనల్స్ లో విజేత ఎవరో తేలనుంది. ఈ క్రీడలను ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో.. ఆంధ్రా ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి
Sankranti Special: 'గుండు'నెత్తగలవా ఓ నరహరి.. దమ్ము చూపగలవా..!