ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో ముగ్గురు పోలీసు అధికారులపై.. ఈసీ వేటు - complaint

రాష్ట్రంలో ప్రచారపర్వం ముగిసింది కానీ అధికారుల బదీల ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆరుగురు అధికారులను బదిలీ చేసిన ఈసీ... తాజాగా మరో ముగ్గురిపై వేటు వేసింది.

ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్

By

Published : Apr 9, 2019, 10:20 PM IST

రాష్ట్రంలో అధికారుల బదిలీ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే సీఎస్, ఇంజెలిజెన్స్ డీజీ, కడప, శ్రీకాకుళం ఎస్పీలు, మదనపల్లె సీఐలపై వేటు చేసిన ఈసీ... తాజాగా మరో ముగ్గురు పోలీసు అధికారులను బదిలీ చేసింది. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్, తాడేపల్లి, మంగళగిరి సీఐలు స్థానచలనం పొందారు. తాడేపల్లి సీఐగా సురేశ్ కుమార్​ను ఈసీ నియమించింది. అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైకాపా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ ప్రవీణ్​ను మార్చాలని గత నెల 25న వైకాపా.. ఈసీని కోరింది. తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని... తమ పార్టీకి చెందిన చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమెహన్​పై అనవసర కేసులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగానే ప్రకాశం ఎస్పీ కోయప్రవీణ్​ని బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details