ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్తరాఖండ్​లో... రాష్ట్రానికి చెందిన 20 మందికి కరోనా

రాష్ట్రానికి చెందిన 20 మందికి.. ఉత్తరాఖండ్​లో కరోనా సోకింది. దేశంలోని పలు ప్రాంతాల్లోని అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు.. నైనిటాల్​కు యాత్రగా చేరుకున్న 24 మంది సైక్లిస్ట్ బృందంలో 20 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం వీరంతా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​ సెంటర్​లో ఉన్నారు.

20-members
20-members

By

Published : Apr 10, 2021, 3:10 AM IST

Updated : Apr 10, 2021, 8:32 AM IST

రాష్ట్రానికి చెందిన 20 మంది సైక్లిస్ట్​లు.. ఉత్తరాఖండ్​లో కొవిడ్ బారిన పడ్డారు. నైనిటాల్​లోని ఓ హోటల్​ చేరుకున్న వీరిని అక్కడి యాజమాన్యం కొవిడ్ పరీక్షల నివేదిక కోరింది. దీంతో బృందంలోని 24 మంది నైనిటాల్​లోని బీడీ పాండే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా..20 మందికి పాజిటివ్​గా తేలింది. సైక్లింగ్ ద్వారా దేశంలోని పలు రాష్ట్రాల్లోని పరిస్థితులు తెలుసుకునేందుకు యాత్రగా బయలుదేరిన ఈ బృందం ప్రస్తుతం ఉత్తరాఖండ్​లో పర్యటిస్తుంది.

ప్రస్తుతం క్వారంటైన్​లో..

ప్రస్తుతం వీరంతా ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ.. సుఖతాల్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ క్వారంటైన్​ సెంటర్‌లో ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మీదుగా ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఈ బృందం ఏప్రిల్ 2న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తన నివాసంలో కలిసింది.

ప్రకాశం జిల్లాకు చెందిన వీరంతా ఓ గిరిజన వర్గానికి చెందిన వారుగా తెలిసింది. ఈ బృందంలోని వారందరూ 18 ఏళ్లలోపు వారే కాగా.. 8 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. వీరిలో 6 గురు బాలికలు.. ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. 150 రోజుల్లో 9,000 కిలోమీటర్లు ప్రయాణించాలని నిర్దేశించుకున్న ఈ బృందం.. కరోనా సోకడంతో యాత్రను వాయిదా వేసుకుంది.

ఇదీ చదవండి:

'కొవిడ్​ అనంతరం కొత్త ఉపాధి అవకాశాలు'

Last Updated : Apr 10, 2021, 8:32 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details