ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు విరాళం

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు అందజేస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఉన్న శీతల గిడ్డంగుల యజమానులు సంయుక్తంగా రూ.10 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

10 lakh rupees donated for cm relief fund in prakasam district
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళం

By

Published : Apr 9, 2020, 3:06 PM IST

కరోనా కట్టడికి సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని శీతల గిడ్డంగుల యజమానులు రూ.10 లక్షల విరాళం అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. శ్రీరామ తులసమ్మ కోల్డ్​ స్టోరేజి, శ్రీలక్ష్మి కోల్డ్​ స్టొరేజి, సత్య కోల్డ్​ స్టోరేజి , కొండగుంట నాగభూషణం కోల్డ్​ స్టోరేజి, దత్తగణపతి కోల్డ్​ స్టోరేజి, ప్రసన్న సుప్రజ కోల్డ్ స్టోరేజి, కోమలి కోల్డ్ స్టోరేజి, సాయిరాం కోల్డ్ స్టోరేజి, పెంట్యాల కోల్డ్ స్టోరేజి, శ్రీ బాలాజీ కోల్డ్ స్టోరేజి యజమానులు పది మంది స్థానిక వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రావి రామనాధం బాబుకు చెక్కును అందచేశారు.

ABOUT THE AUTHOR

...view details