నెల్లూరు కుక్కలగుంట ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చిన్నపాటి వివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. కూరగాయల వ్యాపారం చేసే సాయికి, దయానంద్ అనే వ్యక్తికి మద్య వివాదం నెలకొంది. సాయిపై దయానంద్ కత్తితో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కలగుంటలో వ్యక్తి దారుణ హత్య - కుక్కలగుంటలో హత్య వార్తలు
ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ ఘటన నెల్లూరు కుక్కలగుంట ప్రాంతంలో జరిగింది.
కుక్కలగుంటలో ఓ వ్యక్తి దారుణ హత్య
ఇదీ చూడండి.దసరా హోరు.. వాహన విక్రయాల జోరు