ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 24, 2020, 9:00 PM IST

ETV Bharat / state

కరోనా పరీక్షలు ఆలస్యం..కుళ్లిన మృతదేహం

కరోనా నిర్ధరణ పరీక్షలు ఆలస్యంగా కావడంతో.. నెల్లూరులో ఓ మృతదేహం కుళ్లిపోయింది. అధికారుల నిర్లక్ష్యంగానే...మృతదేహానికి పురుగులు పట్టాయని సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. మృతుడిని చూసి..బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

worms on the deadbody due to delayed of Corona tests in nellore
నెల్లూరులో పురుగులు పట్టిన మృతదేహం

మృతదేహానికి కరోనా పరీక్షలు చేయకుండా ఆలస్యం చేశారు. చివరికి ఆ శవం కుళ్లి పురుగులు పట్టింది. నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన కాలేషా అనే వ్యక్తి అనారోగ్యంతో ఈ నెల 19వ తేదీన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

గురువారం మృతదేహాన్ని తీసుకువెళ్లినా కరోనా పరీక్షలు చేయడం ఆలస్యం కావడంతో... మృతదేహం కుళ్లి, పురుగులు పట్టింది. నాలుగు రోజుల తర్వాత పరీక్షల రిపోర్టు రావడంతో...మృతదేహాన్ని తీసుకువెళ్లాలని బంధువులకు సమాచారమందించారు. వారు వెళ్లి కాలేషా పరిస్థితి చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.... అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరీక్షలు ఆలస్యం కావడంపై సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం అనారోగ్యంతో కాలేషా భార్య మృతి చెందగా....వీరి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మారాడు.

ఇదీచూడండి.బరువైన బతుకులు.. సొంతగూటి వైపే అడుగులు!

ABOUT THE AUTHOR

...view details