నెల్లూరు జిల్లా ఎస్పేట మండలం హసనాపురం కూడలిలోని ప్రభుత్వ మద్యం షాపు వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. మద్యం షాపు ముందు బైఠాయించి మద్యం షాపు మూసి వేయాలంటూ డిమాండ్ చేశారు. కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతుండటానికి తోడు పక్క మండలం షాపులు మూసి వేయడం, వారు కూడా ఇదే ప్రాంతానికి మద్యం కోసం వస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఎక్కువగా చెన్నై నుంచి వచ్చిన వారు ఉన్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మద్యం కోసం వచ్చిన వారితో కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నందున వైన్ షాపులు మూసివేయాలని డిమాండ్ చేశారు.
మద్యం దుకాణం మూసివేయాలని మహిళల ఆందోళన - liquor stores in nellore latest news
కరోనా ప్రబలుతున్న కారణంగా గ్రామంలో మద్యం షాప్ మూసివేయాలని హసనాపురం కూడలిలో వైన్ షాపు ఎదుట మహిళలు బైఠాయించి ఆందోళన చేశారు. పక్క మండలంలో మద్యం దుకాణాలు మూసివేయడం పెద్ద సంఖ్యలో తమ గ్రామానికి మద్యం ప్రియులు వస్తుండటం కరోనా వింజృంభిస్తోందని ఆరోపించారు.
మద్యం దుకాణం మూసివేయాలని మహిళలు ఆందోళన