నెల్లూరు జిల్లా తుమ్మలపెంట సచివాలయంలో ఉద్యోగులైన శిరీష, పవిత్ర... విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శిరీష అక్కికక్కడే మృతి చెందగా... పవిత్ర తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితురాలిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ... ఒకరు మృతి - నెల్లూరు జిల్లా నేర వార్తలు
నెలూరు జిల్లా కావలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరొకరికి గాయాలయ్యాయి.
ద్విచక్రవాహనం-లారీ ఢీ... ఒకరు మృతి