ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిలలో 78 టీఎంసీలకు నీటి నిల్వకు యత్నం: మంత్రి అనిల్ - నిండుకుండలా మారిన సోమశిల జలాశయం

సోమశిల జలాశయంలో రికార్డు స్థాయిలో నీటిని నిల్వ చేసినట్లు జన వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 74 టీఎంసీల నీరు సోమశిలలో చేరిందని తెలిపారు.

water storage record in somasila reservoir

By

Published : Oct 12, 2019, 7:15 PM IST

సోమశిలలో 78 టీఎంసీలకు నీటి నిల్వకు యత్నం: మంత్రి అనిల్

సోమశిల జలాశయంలో రికార్డు స్థాయిలో నీటిని నిల్వ చేసినట్లు జన వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా74టీఎంసీల నీరు సోమశిలలో చేరిందన్నారు.గతంలో73టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేయగా,తాము ప్రస్తుతం74టీఎంసీలకు చేర్చామని తెలిపారు.జలాశయం పూర్తిస్థాయి సామర్థమైన78టీఎంసీల నీటి నిల్వకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని,జలాశయాలన్ని నిండుకుండలా మారాయన్నారు.శ్రీశైలం నుంచి నెల్లూరు జిల్లాకు ఇప్పటివరకు104టీఎంసీల నీటిని తీసుకు వచ్చినట్లు తెలిపారు.కండలేరు జలాశయానికి పూర్తిస్థాయిలో నీటి విడుదల చేసి,జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details