నెల్లూరు జిల్లా పెన్నా ఆయుకట్టు పరిధిలోని కాలువల్లో పూడిక తీసేందుకు ప్రభుత్వం 4 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. రబీ సీజన్లో వరి సాగు చేసే రైతులకు నీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగానే కాలువల్లో పూడికలు తీస్తున్నట్లు తెలిపారు. వారం, పది రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. పెన్నా ఆయకట్టు పరిధిలోని జాఫర్ సాహెబ్, సర్వేపల్లి, కృష్ణపట్నం, పైడేరు కాలువల్లో పూడికలు పనులు జరుగుతున్నాయన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలతో ముందస్తుగా పనులు ప్రారంభించినట్లు వారు వెల్లడించారు.
కాలువలు పూడికలు తీసేందుకు నిధులు - కాలువ పూడికలు తీసేందుకు నిధులు తాజా వార్తలు
నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలతో... కాలువల్లో పూడిక తీసేందుకు ప్రభుత్వం 4 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
జలవనరుల శాఖ అధికారులు మీడియా సమావేశం
ఇవీ చూడండి...