నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఇటీవల వర్షాలకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహంతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న చేతి పంపు నుంచి కొట్టకుండానే నీరు ధారాళంగా వస్తోంది. ఇటీవల వర్షాలకు భూగర్భజలాలు పెరిగి బోరింగ్ నుంచి నీరు వస్తోందని స్థానికులు అంటున్నారు. గతంలో కూడా భారీగా వర్షాలు వచ్చినప్పుడు దాదాపు రెండు నెలల పాటు ఈ బోరింగ్ నుంచి నీళ్లు వచ్చాయని తెలిపారు.
జలధార...కొట్టకుండానే బోరింగ్ నీళ్లు - నెల్లూరు జిల్లా వార్తలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చేతి పంపు నుంచి నీరు ధారాళంగా వస్తోంది. కొట్టకుండానే నీరు వస్తుండడం వల్ల స్థానికులు వింతగా చూస్తున్నారు. ఇటీవల వర్షాలకు భూగర్భజలాలు పెరిగి జలధార వస్తోందని స్థానికులు అంటున్నారు.
Water pump