నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వేసవికి ముందే నీటికష్టాలు మెుదలయ్యాయి. గంగిరెడ్డిపల్లెలో తాగునీటి కోసం జనాలు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భజలాలు అడుగంటి పోయాయి. కనీస అవసరాలు దేవుడెరుగు... తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక గ్రామంలో ఉండే నీటిశుద్ధి కేంద్రం నుంచి వచ్చే వృథా నీటిపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ఉదయగిరిలో నీటిఎద్దడితో ప్రజల అవస్థలు
ఉదయగిరిలో నియోజకవర్గంలో నీటి సమస్య మెుదలైంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను తీర్చమని అధికారులను వేడుకుంటున్నారు.
ఉదయగిరిలో నీటి యెద్దడి... ఇబ్బందుల్లో ప్రజలు