ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కండలేరు జలాశయంలో 60 టీఎంసీల నీరు నింపుతాం' - కండలేరు జలాశయంలో 57 టీఎంసీల నీరు వార్తలు

నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయంలో ప్రస్తుతం 57 టీఎంసీలకు నీరు చేరిందని కండలేరు జలాశయం ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జలాశయం నుంచి 3300 క్యూసెక్కులు చెన్నై , శ్రీకాళహస్తి ,తిరుపతి ప్రజలకు తాగు నీటి అవసరాలకు నీటిని అందజేస్తున్నామని అన్నారు.

water flow at kandaleru reservoir
'కండలేరు జలాశయం

By

Published : Oct 19, 2020, 11:18 PM IST

నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయంలో ప్రస్తుతం 57 టీఎంసీలకు నీరు చేరిందని కండలేరు జలాశయం ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు కండలేరు జలాశయంలో 60 టీఎంసీల నీరు నింపుతామన్నారు. జలాశయం ఆయుకట్టు పరిధిలోని దాదాపు 400 చెరువుల్లో నీళ్లు నింపుతున్నట్టు చెప్పారు.

ఆయకట్టు పరిధిలో ప్రతి రబీ సీజన్లో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఈ రబీ సీజన్లో మూడు లక్షల పైచిలుకు ఎకరాలకు సాగు నీరు సమృద్ధిగా అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం జలాశయం నుంచి 3300 క్యూసెక్కులు చెన్నై, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రజలకు తాగు నీటి అవసరాలకు నీటిని అందజేస్తున్నామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details