నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కలువాయి మండల కేంద్రంలోని చెరువు నిండు కుండలా మారింది. ఇప్పటికే వరద ఉద్ధృతిలో సోమశిల దక్షిణ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా.. కలువాయి చెరువుకు గండి కొట్టారు. నీటిని నది వైపు మళ్లించారు.
WATER DIVERTED TO CANAL IN ATMAKUR : ఆ చెరువుకు గండి కొట్టిన అధికారులు - Water diverted to kaluvayi canal in nellore district
నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు జలాశయాలు నిండు కుండలా ప్రవహిస్తున్నాయి. ముంద జాగ్రత్తగా అధికారులు కలువాయి చెరువుకు గండి కొట్టారు.
కాలువకు గండి కొట్టిన అధికారులు
ఇటు.. ఇందుకూరుపేట మండలంలోని ముదివర్థిపాలెం వద్ద పెన్నా నది పొర్లు కట్టలకు గండి పడింది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో చాలా మంది రోడ్ల మీదనే భోజనాలు చేస్తున్నారు.
ఇదీచదవండి.