నెల్లూరులోని బాలాజీ నగర్‌లో వినూత్నంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాం అందరినీ ఆకట్టుకుంటోంది. భారీ సెట్టింగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ మండపాన్ని భక్తులు సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేలా గరికతో ఏర్పాటు చేసిన మండపంలో... సర్వాభరణాలతో ముస్తాబైన మట్టి వినాయకున్ని ప్రతిష్టించారు. మండపం లోపల ఆలయ గోపురం తోపాటు ధ్వజస్తంభాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్వామివారికి భజన చేస్తున్నట్లు మూషికాలను ఏర్పాటు చేశారు. బయట 40 అడుగుల ఎత్తు నుంచి పడేలా వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేసి, శివలింగం, బాలగణపతులను రూపొందించారు. టెంకాయలు, వివిధ రకాల కృత్రిమ పండ్లతో ఏర్పాటు చేసిన అలంకరణ భక్తులను మైమరిపిస్తోంది.
వినూత్న హంగులతో వినాయక మండపం ! - innovative
నెల్లూరు జిల్లాలో వినూత్న హంగులతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. భారీ సెట్టింగులతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన మండపంలో లంబోదరుడు భక్తులకు దర్శనమిస్తున్నారు.
వినూత్న హంగులతో వినాయక మండపం !