'పేదరికం లేని సమాజం కావాలి'
మానవసేవే-మాధవసేవ అని మహాత్ముడు చెప్పిన సూత్రాన్ని పాటించడమే అన్నింటికంటే గొప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. పేదరికం లేని సమాజ స్ధాపనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సూచించారు. ఎంతోమంది శాస్త్రవేత్తలను ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానిదని కొనియాడారు.
పేదరికం లేని సమాజం కోసం అందరూ కృషిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వర్ణభారత్ ట్రస్టు వార్షికోత్సవంలో మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వ్యవసాయంలో నూతన సాంకేతికతలు వస్తున్నాయనీ...అందుకు అనుగుణంగా మెళకువలు అవసరమని చెప్పారు.భారత్‌లో యువత అధికంగా ఉందనీ, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ట్రస్టు లక్ష్యమని పేర్కొన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భరతనాట్యం, కూచిపూడిని ప్రోత్సహించాలని చెప్పారు.