నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేటలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో అతనిని పరీక్షించడానికి ఇంటికి వచ్చిన వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి పాజిటివ్ గా తేల్చారు. అతనిని పరిరక్షించేందుకు వచ్చిన వైద్య సిబ్బంది రక్షణ కోసం వేసుకున్న పీపీఈ కిట్లు వీధిలో పడేసి వెళ్లిపోయారు. టెస్ట్ చేసిన గంటకే ఆ వ్యక్తికి పాజిటివ్ రాగా 108 వాహనంలో ఐసోలేషన్ కు అధికారులు తరలించారు. అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వాడిన పీపీఈ కిట్లు అక్కడే ఇళ్ళ మధ్యనే పడవేసి వెళ్ళడంతో స్ధానికుల్లో భయాందోళన మొదలైంది.
నిర్లక్ష్యం: ఇళ్ల స్థలాల మధ్యలో వాడి పారేసిన పీపీఈ కిట్లు - nellore district
వైద్య సిబ్బంది, కరోనా బాధితుడు వాడిన పీపీఈ కిట్లను నిర్లక్ష్యంగా నివాస స్ధలాల మధ్య పడేసిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో చోటు చేసుకుంది.
నిర్లక్ష్యం: ఇళ్ల స్థలాల మధ్యలో వాడి పారేసిన పీపీఈ కీట్లు