ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా వేళ 17 సవర్ల బంగారం, 10 వేల నగదు చోరీ

By

Published : May 5, 2020, 9:36 AM IST

ఉదయగిరి కోళ్ల వీధిలోని ఓ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 17 సవర్ల బంగారం, 10 వేల నగదు దొంగలించారు. ఎస్సై జ్యోతి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

unknown persons theft house in udayagiri
ఇంట్లో చొరబడి బంగారం, నగదు దోచుకెళ్లిన దొంగలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి కోళ్ల వీధిలోని ఓ ఇంట్లో దుండగలు తెల్లవారుజామున ప్రవేశించి 17 సవర్ల బంగారం, నగదు అపహరించారు. సమాచారం అందుకున్న ఎస్సై జ్యోతి... ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోళ్ల వీధికి చెందిన ఖలీల్​, తన భార్య కుమార్తెతో కలిసి ఇంటి తలుపులకు తాళాలు వేసి వరండాలో నిద్రించారు. ఇంటి బీరువా తాళాలు తల దిండు కింద పెట్టుకొన్నారు. ఆదమరించి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాన్ని అపహరించి ఇంట్లో ఉన్న 17 సవర్ల బంగారం, 10 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్సై జ్యోతి సిబ్బందితో కలిసి పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇంట్లో చొరబడి బంగారం, నగదు దోచుకెళ్లిన దొంగలు

ABOUT THE AUTHOR

...view details