నెల్లూరు జిల్లా కావలి వద్ద పిడుగుపాటుకు రైల్వే లైను విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఓహెచ్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు నిపుణులు గుర్తించారు. దీంతో కావలిలో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. విద్యుత్ అంతరాయంతో కృష్ణా, హౌరా, పినాకిని ఎక్స్ప్రెస్ రైళ్లు గంటకుపైగా నిలిచిపోయాయి. రైళ్ల నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
Trains: విద్యుత్ సరఫరాలో అంతరాయం..నిలిచిన పలు రైళ్లు
నెల్లూరు జిల్లా కావలి వద్ద పిడుగుపాటుకు రైల్వే లైను విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో కావలిలో పలు రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి.
విద్యుత్ సరఫరాలో అంతరాయం