నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని 212 మంది వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. కమిషనర్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వారి బాధ్యతనీ.. దాన్ని సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలనీ.. నీతిమంతమైన పాలన అందించే దిశగా పాలక వర్గానికి సహకరించాలని కోరారు.
'వాలంటీర్లు.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి' - నాయుడుపేట
ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వాలంటీర్ల లక్ష్యమని నెల్లూరు జిల్లా నాయుడుపేట కమిషనర్ తెలిపారు. వాలంటీర్లుగా ఉద్యోగాలు పొందిన వారికి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.
'వాలంటీర్లు.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి'