ఆంధ్రప్రదేశ్

andhra pradesh

supreme: సుప్రీంలో.. ఆనందయ్య మందు పంపిణీపై దాఖలైన వ్యాజ్యం కొట్టివేత

By

Published : Jul 17, 2021, 1:27 PM IST

Updated : Jul 17, 2021, 3:10 PM IST

ఆనందయ్య మందు పంపిణీ అంశంపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టును అపహాస్యం చేయొద్దంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.

The Supreme Court struck down the  petition of Anandayya  medicine  distribution
ఆనందయ్య మందు పంపిణీ వ్యాజ్యాన్ని కొట్టేసిన సుప్రీం

ఆనందయ్య మందుపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలో.. సుప్రీం కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కోర్టును అపహాస్యం చేయొద్దంటూ పిటిషనర్‌ తరపు న్యాయవాదిని హెచ్చరించింది. నెల్లూరు జిల్లాలో ఆనందయ్య మందు కరోనాకు అద్భుతంగా పనిచేస్తోందని, దాని పంపిణీని పునఃప్రారంభించాలంటూ లా విద్యార్థి అభినందన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఏఎస్‌.బోపన్న, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది.

విచారణ ఆరంభం కాగానే మీకేం కావాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశ్నించారు. తాము పిటిషన్‌ వేసి చాలా రోజులైందని.. సాంకేతికంగా పిటిషన్‌ విచారణ అవసరం లేదని న్యాయవాది సమాధానమిచ్చారు. హైకోర్టుకు వెళ్లాలని బదులిచ్చిన ధర్మాసనం.. ఇలాంటి కేసులతో కోర్టును అపహాస్యం చేయొద్దని హెచ్చరించింది. పిటిషన్‌ ఉపసంహరణకు అభ్యర్ధించగా అందుకు అంగీకరించని ధర్మాసనం... కేసును కొట్టేస్తున్నట్లు తెలిపింది.

Last Updated : Jul 17, 2021, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details