High Court on Nellore canal works : నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మూడు కాలువలకు రిటైనింగ్ వాల్ నిర్మాణ నిమిత్తం జారీ చేసిన కోట్ల రూపాయల టెండర్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి, నెల్లూరు కలెక్టర్, నెల్లూరు జలవనరుల శాఖ సూపరింటెండెట్ ఇంజినీర్, సిరి కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తదితరులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలేని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
High Court : నెల్లూరులో కాలువల పనుల టెండర్లపై హైకోర్టులో పిల్
High Court on Nellore canal works : నెల్లూరులో కాలువల పనుల టెండర్లపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న వారికి నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని సర్వేపల్లి, కృష్ణపట్నం, జాఫర్ సాహెద్ కాలువలకు రిటైనింగ్ వాల్ నిర్మాణ నిమిత్తం జారీ చేసిన కోట్ల రూపాయల టెండర్‌ను సవాలు చేస్తూ నెల్లూరుకు చెందిన మురళీరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. జలవనరులశాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ నియోజకవర్గం పరిధిలోని కాలువకు మాత్రమే మొత్తం నిధులు వినియోగిస్తున్నారన్నారు. మంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయాది వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ .. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయన్నారు. సిరి కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టెండర్ కట్టబెట్టారన్నారు. మూడు కాలువులకు వాడాల్సిన నిదుల్ని నిబంధనలకు విరుద్ధంగా జలవనరుల శాఖ మంత్రి నియోజకవర్గంలోనే వినియోగిస్తున్నారన్నారు. టెండర్ పనుల అంచన మొదట 99.90 కోట్లుగా నిర్ణయించారన్నారు. రెండు నెలల తర్వాత అంచనా మొత్తాన్ని 120 కోట్లకు పెంచారన్నారు. వాస్తవానికి 100 కోట్ల విలువకు పైబడిన టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రివ్యూ పరిధి నుంచి తప్పించుకునేందుకు అంచనాను మొదట 99.90 కోట్లుగా పేర్కొని టెండర్ కేటాయించారన్నారు. మూడు కాలువల కోసం పిలిచిన టెండర్ పనులను మంత్రి నియోజకవర్గం పరిధిలోని కాలువకే పరిమితం చేయడం సరికాదన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. ప్రతివాదులుగా ఉన్న వారికి నోటీసులు జారీచేసింది.
ఇదీ చదవండి