ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 9, 2021, 9:16 AM IST

ETV Bharat / state

ప్లాస్టిక్‌ వ్యర్థ రహిత నగరమే లక్ష్యం

నెల్లూరు నగరంలోని మూడు ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ సీసాల క్రషింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక గాంధీబొమ్మ కూడలిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యంత్రాన్ని ప్రారంభించారు.

The goal is a plastic
The goal is a plastic

ప్లాస్టిక్‌ సీసాల వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా.. గాంధీబొమ్మ, ఆర్టీసీ బస్టాండ్‌, ఆత్మకూరు బస్టాండ్‌ ప్రాంతాల్లో సీఎస్‌ఆర్‌ నిధులతో క్రషింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేశామని మంత్రి అనిల్ తెలిపారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను యంత్రంలో వేస్తే రీసైక్లింగ్‌ అవుతుందని, దాంతో పాటు ఓ గిఫ్ట్‌ కూపన్‌ వస్తుందన్నారు. ఇందుకోసం ఖాదీబండార్‌, ఓ రెస్టారెంట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, వీటి సంఖ్య మరింత పెంచేలా షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్‌ తదితరాల్లో డిస్కౌంట్‌ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మరో ఎనిమిది నెలల్లో కార్పొరేషన్‌కు సంబంధించిన రూపురేఖలు మార్చేలా ముందుకెళుతున్నామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, నాయకులు ఎండీ ఖలీల్‌ అహ్మద్‌, దార్ల వెంకటేశ్వర్లు, మహేష్‌, నీలి రాఘవరావు, సుధీర్‌, మున్వర్‌, సిద్దిక్‌ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details