మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నెల్లూరులో తెలుగు మహిళలు వినూత్నంగా నిరసన చేశారు. నల్ల చీరలు ధరించి, రిబ్బన్లతో చేతులకు సంకెళ్లు వేసుకుని స్థానిక నర్తకి సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం మోకాళ్లపై కూర్చుని మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి దయనీయంగా తయారైందంటూ తెదేపా నాయకురాలు అనురాధ విమర్శించారు. మూడు రాజధానులు చేస్తే ముగ్గురు ముఖ్యమంత్రులను పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరించారు.
అమరావతికి మద్ధతుగా చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి దయనీయంగా తయారైందంటూ తెదేపా నేతలు విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పార్టీ నేత అనురాధ నెల్లూరులో తెలుగు మహిళలతో కలిసి వినూత్నంగా నిరసన చేశారు.
అమరావతికి మద్ధతుగా నెల్లూరులో తెలుగు మహిళల వినూత్న నిరసన