ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు - లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు

ఈ నెల 22 నుంచి విదేశాల నుంచి విమాన సర్వీసులు నిలిపివేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో లండన్​లో ఉన్న భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే విమాన సర్వీసులు లేనందున గ్యాట్​విక్​ విమానాశ్రయంలో 30 మంది తెలుగువాళ్లు ఎదురుచూస్తున్నారు.

లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు
లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు

By

Published : Mar 20, 2020, 7:51 PM IST

లండన్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు

లండన్‌ గ్యాట్‌విక్‌ విమానాశ్రయంలో 30 మంది ఏపీ, తెలంగాణవాసులు చిక్కుకున్నారు. ఈ నెల 22 నుంచి విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం వల్ల... ఇవాళే భారత్‌కు వచ్చేందుకు భారతీయులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. గ్యాట్‌విక్‌ విమానాశ్రయానికి చేరుకున్న 70 మందిలో ఏపీ, తెలంగాణ, రాజస్థాన్‌, గుజరాత్‌ వాసులు ఉన్నట్లు సమాచారం.

భారత్‌కు విమాన సేవలు నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించటంతో ప్రయాణికులు భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమను ఇండియాకు పంపించాలని అధికారులను వేడుకున్నారు. ఈటీవీ తెలంగాణకు సిరిసిల్ల వాసి శరణ్​ ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.

ఇవీ చదవండి

ఉరికి ముందు తిహార్​ జైలు ఎస్పీకి నిర్భయ దోషి గిఫ్ట్!

ABOUT THE AUTHOR

...view details