నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి మేయర్ అబ్దుల్ అజీజ్ ను గెలిపించాలని కోరుతూ సినీనటుడు తారకరత్న ప్రచారం చేశారు.
నెల్లూరు తెదేపా తరపున సినీనటుడు తారక్ ప్రచారం
By
Published : Mar 28, 2019, 6:38 PM IST
నెల్లూరు తెదేపా తరపున సినీనటుడు ప్రచారం
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి మేయర్ అబ్దుల్ అజీజ్‌ను గెలిపించాలని కోరుతూ సినీనటుడు తారకరత్న ప్రచారం చేశారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనికోరారు. వేదాయపాలెం సెంటర్ నుంచి గాంధీ నగర్ రోడ్డు మీదుగా డైకస్ రోడ్ సెంటర్ వరకు రోడ్ షో చేశారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. రాష్ట్రాన్ని చంద్రబాబు సమర్థవంతంగా ముందుకు నడిపించారని కొనియాడారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.